నమస్కారం, నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా డుగ్గు..డుగ్గు..డుగ్గు..డుగ్గు డుగ్గనీ...అందాల దునియానే జూపిత్తపా చిక్కు..చిక్కు..చిక్కు.చిక్కు బుక్కనీ... ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అవుతోందో అందరికీ తెలిసిందే...కారణం...మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, పోన్కల్ గ్రామంలో జరిగిన ఒక పెళ్ళి బరాత్ లో వధువు వరుడి ముందు చేసిన డాన్స్ కి సంబంధించిన వీడియో వైరల్ అయి రాత్రికి రాత్రే ఆ కొత్త జంట ఫేమస్ అయిపోయారు... నిజంగా ఆ పెళ్ళి కూతురు చేసిన డాన్స్ వల్లే ఆ వీడియో అంత వైరల్ అయ్యిందా...? అస్సలు కాదు...ఆ పెళ్ళి కూతురు ఈ పాటకు కాకుండా ఇంకో పాటకు డాన్స్ చేసి ఉంటే అది ఇంత వైరల్ అయ్యుండేది కాదు...ఎందుకంటే ఈ పాట గొప్పతనం వల్ల ఆమె చేసిన డాన్స్ కి అందం వచ్చింది... కారణం ఈ పాటలో అత్తవారింట్లో అడుగు పెట్టే ప్రతి పెళ్ళి కూతురు కనే కలలూ, ఆశలూ, ఆశయాలూ అన్నీ అద్భుతంగా వర్ణించాడు ఈ పాట రచయిత అచ్చ తెలంగాణ యాసలో.. ఈ బుల్లెట్ బండి పాట నేపధ్యం... ఒక ప్రైవేట్ ఆల్భమ్ గా నాలుగు నెలల క్రితం యూ ట్యూబ్ లో విడుదలై ఇప్పటికీ ముప్పై మిలియన్ వ్యూస్ దాటింది... ఈ పాట రాసింది లక్ష్మణ్, మ్యూజిక్ ఎస్.కె.బాజీ.. సిన...