చూసే కోణం - జీవితం

చూసే కోణం - జీవితం

నమస్కారం 
ఇది నా తొలి ప్రయత్నం. 
మనం ఎందుకు జన్మించాం ?
 ఎందుకు బ్రతుకుతున్నాం ?
మరణం తర్వాత ఏమవతున్నాం ?
ఆలోచిస్తే ఏమీ అర్ధం కాని  స్థితి లో మొదటిసారిగా  నా భావ వ్యక్తీకరణకు ఈ మార్గమును ఉపయోగిస్తున్నాను. 

వాస్తవానికి దూరంగా బ్రతుకుతున్న చాలామందికి ఈ సందేహాలు వస్తుంటాయి. మనం వినేదానికి ప్రపంచం లో జరుగుతున్నదానికి సంబంధం లేని సమయంలో చిన్నపటినుండి నేర్చిన మంచి కంటిముందే చెడుగా మారి మనల్ని మార్చే సమయం లో మనం ఏం ఆలోచించాలి. 

కారణం ఏమి అయ్యి ఉండవచ్చు అదే  మనం ప్రతీ విషయాన్నీ చూసే కోణం

కోణం, త్రిభుజం, సరళరేఖ ..... వంటి గణిత సంబంద విషయాల గురించి మాట్లాడుతున్నాడే అని సందేహించకండి. జీవితం అంటే గణితమే కూడికలు ,తీసివేతలు,భాగాలు,నిష్పత్తులు వీటితో పటు లాభాలు నష్టాలు. మనకు తెలియకుండానే చాలామంది గణిత శాస్త్రవేత్తలు మనలో ఉన్నారు. ఈ రకంగా చూస్తే ఎంతోమంది ఎన్నో విదాలుగా నిత్యం మనకు తారస పడుతూనే ఉన్నారు కాని మనం గమనించక పోవడం జరుగుతూ ఉంది.

అబద్దం చెప్పడం నేరం అని మనమే పిల్లలకి నేర్పిస్తున్నాం. వాస్తవానికి వారి కళ్ళ ముందే నిత్యం ఎన్నో అబద్దాలు చెప్తున్నాం. వారు ప్రశ్నిస్తే ఇది బ్రతికే కళ అవసరం కోసం తప్పు లేదంటాం అదే మనం లౌకికమ్ (లౌక్యమ్ ) గా వ్యవహరిస్తున్నాం. ఇది అబద్దం అనే విషయానికి రెండు కోణాలు.ఏది ఎప్పుడు అవసరం అనేది ప్రతివాడు చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి నేర్చుకుంటున్నాడు. ఇది దేశ కాల మాన పరిస్తితుల మీద కూడా ఆధారపడి ఉండటం ఇంకో కోణం.



సమాజం లో చాలా మంది బ్రతకటం ఎలాగా అని ఆలోచనతోనే కాలాన్ని వెళ్లదీస్తున్నారు.Management thory లో చెప్పినట్లు మానవునికి ముందుగా అత్యవసరమైన 1.తిండి 2. బట్ట 3. గూడు  వంటి అవసరాలు తీరితేనే మిగిలిన వాటి గురించి ఆలోచిస్తారు. వాటిని సాధించుకునే క్రమం లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని జీవన నౌకను వెళ్లదీస్తున్నారు.
వీటిలో భాగంగా బ్రతకడానికి ఏమి చేసినా తప్పు కాదనేది వారి వాదన ఇది ఇంకో కోణం
ఒకే పని ఇద్దరు వ్యక్తులు ఒకే రకంగా చేసినప్పటికీ కొన్ని తప్పు మరికొన్ని ఒప్పుగా పరిగణింప బడుతున్నవి. ప్రతీదాని లో దేశ కాల పరిస్థితులను బట్టి ఆ నిర్ణయాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు గుడిలో ప్రముఖులకు దర్శన సదుపాయం కల్పించుటకు మామూలు మనుషులను వారి బాధలను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ఈ విషయం లో  మనం ఉన్న స్థానాన్ని బట్టి నీతి మారుతోంది.
 ఆ ప్రముఖుల కోణం లో వారు వారి సమయ పాలన ప్రకారం వారి జీవితాలు సమయం విలువైనవి గా పరిగణ లోనికి వస్తున్నాయి.
అధికార యంత్రాంగం ద్రిష్టిలో వారు వారి భాద్యతను నిర్వహిస్తున్నారు.
సాధారణ మనిషి ఇటువంటి వాటిని గూర్చి ఆలోచన చేయడమే మానుకున్నాడు. బ్రతకటానికి ఇటువంటి విషయాలు పట్టించుకునే  తీరికలోనే లేరు. ఇదో కోణం.
ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. మొన్న జరిగిన పుష్కరాల తోక్కిసలాటలో మరణించిన వారి జీవితాలు స్నానానికి వచ్చిన ప్రముఖుల విలువైన సమయానికి సరితూకాలుగా మారిన ప్రపంచంలో ఏమీ ఆలోచించే తీరిక ఓపిక లేకుండా అంతా పైవాడి లీలగా వర్ణిస్తూ ఉండే పెద్దలది మరొక వాదన.
ఇటువంటి కార్యక్రమాలు ఆర్భాటాలు లేకుండా చేస్తే ఎక్కడ వారి పరువు పోతుందో అని ప్రభుత్వాల కోణం.
మన సంస్కృతి సంప్రదాయాలను భక్తి అనే విశ్వాసాలను మేళవించి కోట్లకు కోట్లు ఆర్జించిన పెద్దలది మరో కోణం.
--------------------------------------------------------------------------------------------------------------------------
ప్రతీ నాణెమునకు రెండు పార్శ్వాలున్నట్లే మన జీవితంలో ప్రతీ సంఘటనకు చాలా పార్శ్వాలున్నాయి. కానీ మనం ఒకే విధమైన ఆలోచనా విధానాన్ని అవలంబించి చూడటం వల్ల ఒకే కోణం లో చూడగలుగుతున్నాం. అదే సమయం లో అదే పరిస్థితిని మనం వేరే కోణం తో చూసి ఆలోచించినట్లయితే దాని ఫలితం వేరే పరిస్థితులకు దారి తీయవచ్చు. దీనినే కర్మ సిద్ధాంతం ప్రకారం కూడా విశ్లేషించి చూడచ్చు.
మన కంటి ముందు జరిగే ప్రతీ సంఘటన వేరే ప్రదేశంలో జరిగే ఇంకొక సంఘటనని ప్రభావితం చేస్తుంది. ఇలా ప్రపంచంలో ప్రతీ విషయం మరొక విషయం తో సంబంధాన్ని కలిగిఉంది.
--------------------------------------------------------------------------------------------------------------------------
to be continued.....

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రిచ్ డాడ్ పూర్ డాడ్