పోస్ట్‌లు

జూన్, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

చూసే కోణం - జీవితం

చూసే కోణం - జీవితం నమస్కారం  ఇది నా తొలి ప్రయత్నం.  మనం ఎందుకు జన్మించాం ?  ఎందుకు బ్రతుకుతున్నాం ? మరణం తర్వాత ఏమవతున్నాం ? ఆలోచిస్తే ఏమీ అర్ధం కాని  స్థితి లో మొదటిసారిగా  నా భావ వ్యక్తీకరణకు ఈ మార్గమును ఉపయోగిస్తున్నాను.  వాస్తవానికి దూరంగా బ్రతుకుతున్న చాలామందికి ఈ సందేహాలు వస్తుంటాయి. మనం వినేదానికి ప్రపంచం లో జరుగుతున్నదానికి సంబంధం లేని సమయంలో చిన్నపటినుండి నేర్చిన మంచి కంటిముందే చెడుగా మారి మనల్ని మార్చే సమయం లో మనం ఏం ఆలోచించాలి.  కారణం ఏమి అయ్యి ఉండవచ్చు అదే  మనం ప్రతీ విషయాన్నీ చూసే కోణం కోణం, త్రిభుజం, సరళరేఖ ..... వంటి గణిత సంబంద విషయాల గురించి మాట్లాడుతున్నాడే అని సందేహించకండి. జీవితం అంటే గణితమే కూడికలు ,తీసివేతలు,భాగాలు,నిష్పత్తులు వీటితో పటు లాభాలు నష్టాలు. మనకు తెలియకుండానే చాలామంది గణిత శాస్త్రవేత్తలు మనలో ఉన్నారు. ఈ రకంగా చూస్తే ఎంతోమంది ఎన్నో విదాలుగా నిత్యం మనకు తారస పడుతూనే ఉన్నారు కాని మనం గమనించక పోవడం జరుగుతూ ఉంది. అబద్దం చెప్పడం నేరం అని మనమే పిల్లలకి నేర్పిస్తున్నాం. వాస్తవానికి వారి కళ్ళ ముందే నిత్యం ఎన్నో అబద్దాలు చెప్తున్నాం.